NC24 : నాగ చైతన్య ”తండేల్” సినిమాతో సూపర్ హిట్టు అందుకున్నాడు. ఈ క్రమంలో నాగ చైతన్య కొత్త సినిమాకి రెడీ అవుతుంది. ”విరూపాక్ష” లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన కార్తిక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య తన 24వ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా నాగ చైతన్య ఒక మిథికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ దాదాపు రెండు వారాల పాటు జరుగుతుంది. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి.