ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ లో జరిగిన ఎన్డీయే ఏపీలా సమావేశంలో నరేంద్ర మోడీని ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. ఎన్డీయేను అధికారంలోకి తేవడానికి మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారు. ఎన్నికల ప్రచారం ఆరంభం నుంచి చివరి వరకు మోదీ కష్ణపడ్డారు. ఏపీలోనూ 3 బహిరంగ సమావేశాలు, ర్యాలీల్లో మోదీ పాల్గొన్నారు. మోదీ నేతృత్వంలో 2047 నాటికి భారత్ నంబర్ వన్‌గా నిలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్లమెంట్ మాట్లాడారు. దేశానికీ నరేంద్ర మోడీ ఒక స్ఫూర్తి అన్నారు. యావత్ దేశానికి మోడీ స్ఫూర్తిగా నిలిచారు అని ప్రశంసలు గుప్పించారు.