కార్పేరేట్ దిగ్గజం అదాని ప్రముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీనీ టేకోవర్ చేసింది. న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ సంస్థను బలవంతంగా కొనుగోలు చేశాడని ప్రమోటర్లు ఆరోపించారు. ఆదాని చేజిక్కించుకున్న ఎన్‌డీటీవీ ఇరవై నాలుగు గంటల ఆంగ్ల భాష టీవీతోపాటు ఎన్‌డీటీవీ ఇండియా(హిందీ), ఎన్‌డీటీవీ ప్రాఫిట్(బిజినెస్) అనే మూడు జాతీయ వార్తా ఛానళ్లను ఎన్‌డీటీవీ నిర్వహిస్తున్నది. దీనికి ఆన్‌లైన్‌లో 3.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు
కొనుగోలు జరిగింది ఇలా
అదానీ ఎంటర్ఫ్రైజెస్(ఏఈఎల్)కు చెందిన అదానీ మీడియా వెంచర్స్‌కు పూర్తిస్థాయి అనుబంధ కంపెనీ అయిన విశ్వ ప్రధాన్ కమర్షియల్‌కు ఆర్‌పీఆర్ హోల్డింగ్స్‌లో వారెంట్లు ఉన్నాయి. వీటిని 99.9 శాతం వాటాగా మార్చుకుంది. ఆర్‌పీఆర్ పూర్తిగా వీసీపీఎల్ ఆధీనంలోకి వచ్చింది. ఎన్‌డీటీవీలో ఈ ఆర్ార్‌పీఆర్‌కు 29.9 శాతం వాటా ఉంది. దీంతో ఆ వాటా ఆదానీ గ్రూపుకు రావడంతో ఎన్‌డీటీవీ దక్కింది.