Homeహైదరాబాద్latest Newsనీ యమ్మ.. బయట తిరగనియ్య కొడకా..తోలు తీస్తా.. అసెంబ్లీలో దానం నాగేందర్ బజారు భాష.. ఏంది...

నీ యమ్మ.. బయట తిరగనియ్య కొడకా..తోలు తీస్తా.. అసెంబ్లీలో దానం నాగేందర్ బజారు భాష.. ఏంది ఈ భాష అంటూ జనం ఆగ్రహం..!

  • మౌనంగా విన్న స్పీకర్..
  • ఖండించని ముఖ్యమంత్రి, మంత్రులు
  • దానం వ్యాఖ్యలను తప్పుపట్టిన ఒవైసీ
  • సభ్యుల ఒత్తిడితో రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటన
  • చివరకు క్షమాపణ చెప్పిన దానం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో బరి తెగించారు. బజారు భాష వాడారు. ఓ వీధి రౌడీలా బెదిరింపులకు దిగారు. బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి బూతు మాటలతో చెలరేగిపోయాడు. అయితే నిండు సభలో దానం అలా మాట్లాడుతుంటే మౌనంగా ఉండిపోయారు. కనీసం వారించకపోవడం గమనార్హం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సైతం ముసిముసి నవ్వులు నవ్వారు. శుక్రవారం శాసన సభలో హైదరాబాద్‌ నగర అభివృద్ధి కార్యక్రమాలపై సభలో స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా దానం మాట్లాడుతుండగా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో దానం రెచ్చిపోయారు. విచక్షణ కోల్పోయారు. తానో ఎమ్మెల్యేను అన్న విషయం మరిచిపోయి వీధిరౌడీలా ప్రవర్తించారు. ఆ తర్వాత కూడా తాను మాట్లాడింది తప్పు కాదన్నట్టుగా దానం సమర్థించుకోవడం గమనార్హం. తెలంగాణలో ఈ పదాలన్నీ కామన్ అన్నట్టుగా ఆయన స్పందించారు. ఎట్టకేలకు స్పీకర్ ఆదేశాలతో క్షమాపణ చెప్పారు. ‘నీ అమ్మ.. మిమ్మల్ని బయట తిరగనివ్వా.. నోర్ముయ్ ఓయ్..’ అంటూ రెచ్చిపోయారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలంగాణ ఉద్యమకారులు సైతం మండిపడుతున్నారు. దానం నాగేందర్ ఉద్యమసమయంలో లాఠీలు పట్టుకొని వీధి రౌడీలా చేసిన దాడిని విద్యార్థులను కొట్టిన వైనాన్ని వాళ్లు గుర్తు చేసుకుంటున్నారు.

సర్వత్రా విమర్శలు
దానం వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ సభ్యులతో పాటు ఇతర శాసనసభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దిగొచ్చి క్షమాపణలు చెప్పారు.
దానం నాగేందర్ బూతులు మాట్లాడటంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ క్రమంలోనే మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ కూడా దానం నాగేందర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నీ అమ్మ అని మాట్లాడటం కరెక్ట్‌ కాదని హితవు పలికారు. సభలో ఎవరూ నోరు జారవద్దు.. సహనంతో ఉండాలని సూచించారు. జనాలకు రాంగ్‌ మెసేజ్‌ వెళ్తుందని.. ఆ వ్యాఖ్యలపై దానం నాగేందర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. శాసన సభ్యుల నుంచి తీవ్రమైన స్పందన రావడంతో దానం నాగేందర్‌ దిగొచ్చారు. అమ్మ అనేది హైదరాబాద్‌లో తరచూ వాడుతుంటారని.. అది బూతు కాదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే మళ్లీ స్పీకర్‌ జోక్యం చేసుకోవడంతో దానం నాగేందర్‌ క్షమాపణలు చెప్పారు. ఎవరినైనా బాధ పెట్టి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నా అని అన్నారు. తానెప్పుడూ పరిధి దాటలేదని.. తన పనితీరు గురించి అందరికీ తెలుసని అన్నారు. దానం నాగేందర్ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కూడా స్పందించారు. అసభ్య పదజాలం వాడివుంటే.. రికార్డులు పరిశీలించి తొలగిస్తామని స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img