Homeహైదరాబాద్latest Newsనీకో దండంరా బాబు.. రేవంత్ సర్కార్ పై నిరుద్యోగులు ఫైర్.. స్ట్రాంగ్ వార్నింగ్..!

నీకో దండంరా బాబు.. రేవంత్ సర్కార్ పై నిరుద్యోగులు ఫైర్.. స్ట్రాంగ్ వార్నింగ్..!

తెలంగాణాలో నిరుద్యోగుల ఉద్యమానికి ప్రభుత్వం స్పందించట్లేదు. ఈ నేపధ్యలో రేవంత్ సర్కార్ తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని వారాలుగా డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని రేవంత్ ప్రభుత్వం పైన నిరుద్యోగులు ఒత్తిడి తెస్తున్నా యధావిధిగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. పోస్టులు పెంచి మెగా డీఎస్సీ వేయాలని, ప్రస్తుత డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తిరిగి షాక్ కచ్చితంగా ఇచ్చి తీరుతాం అంటున్నారు నిరుద్యోగులు. ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న రాత్రి అంతా ఆందోళన చేస్తూనే ఉన్న DSC అభ్యర్థులు రేవంత్ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

టెట్‌కు, డీఎస్సీకి పొంతన లేని సిలబస్‌ ఉండడంతో ప్రిపరేషన్‌కు సమయం సరిపోవడం లేదని అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న తాము తమ డిమాండ్ నుండి పక్కకు తప్పుకునే లేదని తేల్చి చెప్పారు. నిన్న రాత్రంతా ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన నిర్వహించిన డీఎస్సి అభ్యర్థులు రేవంత్ సర్కారు తీరు పైన నిప్పులు చెరిగారు. గత ఎన్నికల సమయంలో బస్సు యాత్రలు చేసి ఊరూరు తిరిగి నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని అవ్వా తాతల కాళ్ళు మొక్కి ఓట్లు వేయించాము అని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం చేస్తున్నది ఏమీ లేదని వారు మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులు ఉండవని చెప్పి మహిళలను అర్ధరాత్రి రోడ్డు మీదకు ఈడ్చారని డీఎస్సీ మహిళా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

నిరుద్యోగులకు 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పి అర్ధరాత్రి రోడ్ల మీద కూర్చోవడమే కొలువులు చేశారని వారి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఇదీ కాంగ్రెస్ మా నిరుద్యోగులకు ఇస్తున్న బహుమానం అంటూ మండిపడ్డారు. అర్ధరాత్రి పూట మహిళలు మాకు చదువుకోడానికి సమయం ఇవ్వమని అడుగుతున్నారంటే అసలు మీ దౌర్భాగ్యపు పాలన ఎలా ఉందో అర్థమవుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు అందరం తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇలా అర్దరాత్రి రోడ్డు మీద నిలబెట్టడం సిగ్గుచేటు అని డీఎస్సీ అభ్యర్థులు తెలిపారు. పదేళ్లు పాలన చేసిన నియంత కు బుద్ధి చెప్పినట్టే రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని కచ్చితంగా నిరుద్యోగులు భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయితీ ఎన్నికలలో రేవంత్ సర్కార్ ను ఓడించి తీరుతామన్నారు.

Recent

- Advertisment -spot_img