Homeహైదరాబాద్latest NewsCongress లోకి నీలం మధు

Congress లోకి నీలం మధు

– ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో చేరిక

ఇదేనిజం, పటాన్​ చెరు : బీఆర్​​ఎస్​ నుంచి పటాన్​ చెరు టికెట్​ ఆశించి భంగపడి ఆ పార్టీకి రాజీనామా చేసిన నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆ పార్టీలో చేరారు. సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరు మండలం చిట్కుల్​ గ్రామ సర్పంచ్​గా నీలం మధు పనిచేశారు. అయితే ఈ ఎన్నికల్లో పటాన్​ చెరు సెగ్మెంట్ ఎమ్మెల్యే టికెట్​ ఆశించిన నీలం మధు.. గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​తో భేటీ అయ్యారు. తనకు టికెట్​ ఇవ్వాలని కోరారు. అయితే, బీఆర్ఎస్​ అధిష్టానం​ సిట్టింగ్​ ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డికే పటాన్​చెరు టికెట్​ కేటాయించింది. దీంతో నీలం మధు రెబల్​గా మారి పార్టీకి రాజీనామా చేశారు. తన వర్గంతో రాష్ట్రంలోని ముదిరాజ్​లను ఏకం చేసి, టికెట్​ ఇవ్వాలని సభలు, సమావేశాలు నిర్వహించారు. పార్టీ పునరాలోచిస్తుందని భావించాడు. అయినా, బీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. కాంగ్రెస్​ నుంచి పటా​న్​ చెరు టికెట్​ను మధు ఆశిస్తున్నారు. తనకే టికెట్​ ఇవ్వాలని కాంగ్రెస్​ అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img