పారిస్ ఒలింపిక్స్ తర్వాత కొందరు అథ్లెట్ల బ్రాండ్ విలువ భారీగా పెరిగింది. సిల్వర్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా విలువ 30-40% వృద్ధిరేటుతో రూ.330 కోట్లకు చేరిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 2 పతకాలు అందుకున్న మనూ భాకర్ విలువ 6 రెట్లు పెరిగింది. గతంలో ఒక్కో డీల్‌కు రూ.25 లక్షలు తీసుకొనే ఆమె తాజాగా థమ్స్‌అప్‌తో రూ.1.5 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారు.