దేశవ్యాప్తంగా మెడికల్ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ ప్రవేశ పరీక్ష ఆదివారం జరగనుంది. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఈ పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏడాది ఈ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పరీక్ష సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవు అని తెలిపారు. ఫుల్ స్లీవ్ షర్టులు వేసుకోవద్దు. పూలు, నగలు ధరించవద్దు పేర్కొన్నారు. ఈ అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్ష మార్గదర్శకాలను అనుసరించాలి.