Homeహైదరాబాద్latest NewsNEET question paper leak: నీట్ క్వశ్చన్‌ పేపర్ లీక్‌లో మరో ట్విస్ట్.. పేపర్‌ లీక్‌కు...

NEET question paper leak: నీట్ క్వశ్చన్‌ పేపర్ లీక్‌లో మరో ట్విస్ట్.. పేపర్‌ లీక్‌కు ఒక్కొక్కరి నుంచి అన్ని లక్షలా..?

దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ ప్రవేశ పరీక్ష 2024లో అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. నీట్ పేపర్‌ లీక్‌పై వస్తోన్న ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్‌లో నీట్‌ యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు అక్కడి ఆర్ధిక నేరాల విభాగం (EOU) వెల్లడించింది. వీరి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్‌ పేపర్‌ లీక్‌ చేసినందుకు కొందరు అభ్యర్థులు రూ.30 లక్షల చొప్పున ముడుపులు చెల్లించినట్లు బయటపడింది. ఈ విషయాన్ని పలు మీడియా సంస్థ లోను కథనాలు వస్తున్నాయి. తాజా ఆరోపణలపై జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ స్పందించాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img