నేటి నుంచి జరగాల్సిన నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు కౌన్సెలింగ్‌ను వాయిదా వేసినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఇటీవల నీట్ యూజీ పరీక్షలో పేపర్ లీకేజీలు, గ్రేస్ మార్కుల వ్యవహారంతో వివాదం చెలరేగింది. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, నేతలు ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే.