Homeహైదరాబాద్latest Newsనెల్లూరు జిల్లా రెయిన్ అలర్ట్.. కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ

నెల్లూరు జిల్లా రెయిన్ అలర్ట్.. కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ

బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లాకు వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిపై జిల్లా కలెక్టర్ ఆనంద్ స్పందించారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కంట్రోల్ రూంలో 0861-2331261, 7995576699, 1077 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. నెల్లూరు జిల్లాలోని డివిజన్లు, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు వివరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img