ఇదే నిజం, సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో నేతాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. యూవజన సంఘం నాయకులు పెండ్లి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మొండ్రాయి గ్రామంలో నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ గూడ కుమారస్వామి, ఎంపీటీసీ కోనుకటి రాణి మొగిలి, ఉప సర్పంచ్ పెండ్లి శారద కుమారస్వామి, మాజీ ఎంపీటీసీ కడుదూరి సంపత్, మడత కేశవులు, దామెరుప్పుల చంద్రమౌళి, కక్కేర్ల వీరస్వామి, శేషాద్రి, వార్డ్ సభ్యులు స్వామి, ప్రశాంత్ గౌడ్, నాయకులు అనుముల కుమారస్వామి, పెండ్లి రమేశ్, కంటే కుమారస్వామి, గూడ రాజేందర్, బాలకృష్ణ, పొన్నాల హరీశ్, పరికీ యాకయ్య, వేల్పుల భద్రయ్య, వేల్పుల కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.