Homeఫ్లాష్ ఫ్లాష్మనవరాలి చదువుకు ఇల్లు అమ్మిన తాత.. అండగా నిలిచిన నెటిజన్లు

మనవరాలి చదువుకు ఇల్లు అమ్మిన తాత.. అండగా నిలిచిన నెటిజన్లు

మనవరాలి చదువుకు ఉన్న ఒక్క ఇంటినీ తెగనమ్మిన వృద్ధ ఆటో డ్రైవర్‌ నిబద్ధత ఆన్‌లైన్‌లో నెటిజన్ల హృదయాలను కదిలించింది.

74 ఏండ్ల దేశ్‌రాజ్‌ తన ఇంటిని అమ్మి మనవరాలి కల ఫలించేలా చూశాడు. ఇద్దరు కుమారులు మరణించిన తర్వాత మనవరాలి బాధ్యత తలకెత్తుకున్న దేశ్‌రాజ్‌ తపన అందరినీ కదిలిచింది.

హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే ఫేస్‌బుక్‌ పేజ్‌లో దేశ్‌ముఖ్‌ ఆకాంక్షకు నెటిజన్లు అద్దం పట్టారు.

క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా రూ 24 లక్షలు సేకరించి ఆటోడ్రైవర్‌కు చెక్కు అందించారు.

దేశ్‌ముఖ్‌ స్టోరీ వేలాది మందిని ఉద్వేగానికి లోనుచేసి వారిని నిధి సేకరణ దిశగా పురిగొల్పింది.

రూ. 20 లక్షలు సేకరించాలన్నది లక్ష్యం కాగా దాతలు ఆ మొత్తాన్ని అధిగమించి వృద్ధ ఆటోడ్రైవర్‌కు ఆసరాగా నిలిచారు.

నెటిజన్ల వితరణతో దేశ్‌రాజ్‌కు ఇల్లు కొనుగోలు చేసే వెసులుబాటు కలిగింది.

నెటిజన్లు స్పందించిన తీరుకు దేశ్‌రాజ్‌ కృతజ్ఞతలు తెలుపుతూ చెక్కును అంగీకరించే వీడియోను ఫేస్‌బుక్‌ పేజ్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

దేశ్‌రాజ్‌ జీకి లభించిన మద్దతు అపూర్వం..మీదైన దారిలో మీరు ఆయనకు బాసటగా నిలవడం గొప్ప విషయం..ఇప్పుడాయనకు ఓ గూడు సమకూరింది..తన మనవరాలిని చదివించుకునే స్ధోమత లభించింది.

థ్యాంక్యూ సో మచ్‌ అంటూ హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే రాసుకొచ్చింది.

Recent

- Advertisment -spot_img