తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ఘన విజయాన్ని అందుకున్న మలయాళీ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘ప్రేమలు’. ప్రేమలు సినిమాను దాదాపు రూ.10 కోట్లతో భావనా స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాజిల్, దిలీప్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించగా.. దాదాపు రూ.130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తీకేయ తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈ చిత్రంకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
దీంతో ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఆ ఎదురుచూపులకు తెరపడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ‘ప్రేమలు’ అందుబాటులోకి వచ్చేసింది. గురువారం అర్ధరాత్రి (ఏప్రిల్ 12) నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మలయాళం, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్‌లో మిస్ అయిన వారు ఈ సినిమాను ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు.
Read More : Gaami OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన ‘గామి’