Homeహైదరాబాద్latest NewsWhatsapp యూజర్లకు పండగే.. కొత్తగా AI Image ఫీచర్.. !

Whatsapp యూజర్లకు పండగే.. కొత్తగా AI Image ఫీచర్.. !

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI).. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే రాజ్యమేలుతోంది. ఇప్పటికే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేక పనులను సులభతరం చేసింది. అందుకే, ఈ ఫీచర్ ను అందిచడానికి యావత్ ప్రపంచం పరుగులు పెడుతోంది. అందుకే, AI ఇమేజ్ కోసం వాట్సాప్ కూడా కొత్త ఫీచర్ ను తీసుకు వచ్చింది. ఈ కొత్త ఫీచర్ తో కేవలం ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా ఇమేజ్ లను యూజర్ లకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చని వాట్సాప్ చెబుతోంది.

వాట్సాప్ ఫోటో ఎడిటింగ్ కోసం కొత్త AI ఫోటో ఎడిట్ ఫీచర్ ని పరిచయం చేసింది. ఈ కొత్త ఫీచర్ తో కేవలం ప్రాంప్ట్ కమాండ్ తో నచ్చిన ఇమేజ్ లను ఎడిట్ చేసుకొని కొత్తగా క్రియేట్ చేసుకునే వీలుంది. వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ కోసం Meta AI ని ఉపయోగిస్తుందని కూడా వాట్సాప్ తెలియ చేసింది. దీని అర్ధం ఏమిటంటే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) నీ ఉపయోగించి కోరిన ఇమేజ్ లను వాట్సాప్ కొత్త క్రియేటివ్ ఇమేజ్ గా తయారు చేసి ఇస్తుంది.

ఈ కొత్త ఫీచర్ ను వినియోగించడం చాలా సులభం. ఈ కొత్త AI ఇమేజ్ ఎడిట్ ఫీచర్ తో చాలా సులభంగా ఇమేజ్ లను కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ లను క్రియేట్ చేయడానికి, ముందుగా వాట్సాప్ చాట్ లోకి వెళ్లి మెసేజ్ ఫీల్డ్ లో ‘@’ అని టైప్ చేయాలి. ఇలా టైప్ చేసిన తరువాత click /imagine ఆప్షన్ ద్వారా కావాల్సిన ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసిన తరువాత మీరు అందించిన ఇమేజ్ ని ఎలా మార్చాలనుకుంటున్నారనే విషయాన్ని మెసేజ్ ఫీల్డ్ లో టైప్ చేసి సెండ్ బటన్ పైన నొక్కండి. ఆ తరువాత మీరు అందించిన ఇమేజ్ యొక్క కొత్త AI ఇమేజ్ జనరేట్ అవుతుంది మరియు చాట్ లో ప్రత్యక్షమవుతుంది. అంతేకాదు, ఈ ఇమేజ్ లో ఏదైనా తప్పులు ఉన్నా లేక ఈ ఇమేజ్ నచ్చక పోయినా ఈ ఇమేజ్ ను అప్డేట్ కూడా చేసుకునే అవకాశం కూడా వుంది.

Recent

- Advertisment -spot_img