కృష్ణా జిల్లా మైలవరంలో తమ ఇంటి నిర్మాణం కోసం కాయా కష్టం చేసి దాచుకున్న దాదాపు 5 లక్షల డబ్బు చెదలపాలు అయిన వార్తకు స్వచ్చంధ సంస్థల నుంచే కాకుండా కొన్ని బ్యాంక్ లు కూడా ఈ బాధితులకు సహాయం చేయడానికి ముందుకొచ్చాయి.
కృష్టా జిల్లా మైలవరానికి చెందిన బిజిలి జమలయ్య స్థానికంగా నివాసముంటున్నారు.
జమలయ్య పందుల వ్యాపారం చేస్తాడు. పెద్దగా చదువు లేకపోవడం మరియు చెప్పే వాళ్లు లేకపోవడంతో ఈ బ్యాంక్ అకౌంట్లు వాటి పెద్దగా అవగాహాన లేదు.
దీంతో తన వ్యాపారంలో వచ్చిన ఆ కాస్త లాభాలను తన ఇంట్లోనే ఉన్న ట్రంక్కు పెట్టేలో దాచుకున్నాడు.
ఇలా ఏడాదిగా తన చేతికి వచ్చిన డబ్బులను ట్రంక్కు పెట్టెలో దాచుకుంటూ వస్తోన్నారు జమలయ్య అయితే ఒక రోజు కాస్త డబ్బులు అవసముండి పెట్టే తెరచి చూడాగా దాచుకున్న డబ్బులన్ని చిత్తు కాగితాల్లో ఉండడం చూసి అవాక్కైపోయారు.
దీంతో ఏం చేయాలో తెలియక ఆ చెదలు పట్టిన డబ్బు ముందే కదేలైపోయారు ఇన్నేళ్లు కష్టపడి దాచుకున్న దాదాపు 5 లక్షల సొమ్ము చెదలపాలు అవ్వడంతో ఈ సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.
అయితే ఈ వార్త అన్ని మీడియాల్లో ప్రధానంగా వచ్చిన తరువాత దాతలతోపాటు పలు స్వచ్చంధ సంస్థలు ఈయనకు బాసటగా ఉండేందు ముందుకు వచ్చాయి.
తనపట్ల ఇంత ప్రేమ చూపిస్తోన్న వారందరికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు జమలయ్య.
అయితే త్వరలోనే ఈ చెదల పట్టిన డబ్బును బ్యాంక్ లో జమచేసిన నిబంధనల ప్రకారం డబ్బు తీసుకునేందుకు విజయవాడకు చెందిన స్వచ్చంధ సంస్థ జమలయ్యలకు సహాయం చేస్తోంది.