భారతదేశంలోని అత్యంత ప్రీమియం రైళ్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఒకటి. ఇది భారతీయ రైల్వేలు నిర్వహించే మీడియం-డిస్టెన్స్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్. అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ భోజనం విషయంలో భారతీయ రైల్వే కొత్త నిర్ణయం తీసుకుంది. భారతీయ రైల్వే తాజాగా వందే భారత్ రైళ్లలో భోజన ఎంపికలలో కొన్ని మార్పులు చేసింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులు భోజనం ఆర్డర్ చేసుకోవడం ఇకపై తప్పనిసరి కాదు. ఇదివరకు టికెట్ తీసుకున్న ప్రతి ప్రయాణికుడికి ఫుడ్ ఛార్జీ అనేది అందులోనే కలిపి ఉంటుంది. అయితే ఎప్పుడూ మాత్రం ప్రయాణీకులు భోజనం కావాలా..? వద్దా..? అనే ఆప్షన్ ఎంచుకునే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పించబోతోంది. భోజనం సేవ వద్దు అనుకునేవారు వారి టిక్కెట్ ధరలకు క్యాటరింగ్ ఛార్జీలు జోడించబడవు. అయితే ఇకనుంచి వందేభారత్ ట్రైన్ లో ఈ సరికొత్త నిర్ణయం కారణగా టికెట్ ధర సుమారు రూ. 250 తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది.