తెలంగాణలో కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈవీ పాలసీ వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ టాక్స్ ను కూడా 100 శాతం తగ్గిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనదారులకు ఏడాదికి రూ. లక్ష ఆదా అవుతుందని తెలిపారు. కాగా ఈ పాలసీ 2026, DEC 31 వరకు అమలులో ఉంటుంది.