New feature in Whatsapp Business account : వాట్సప్ బిజినెస్ అకౌంట్‌లో సరికొత్త ఫీచర్..
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్.. బిజినెస్ యాప్‌ను కూడా రిలీజ్ చేసింది.
తమ బిజినెస్ కోసం ప్రత్యేకంగా బిజినెస్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకునే వెసులుబాటును వాట్సప్ యూజర్లకు సంస్థ కల్పించింది.
తాజాగా వాట్సప్ బిజినెస్ అకౌంట్‌లో సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్టు వాట్సప్ ప్రకటించింది.
వాట్సప్ బిజినెస్ అకౌంట్‌లో చాట్ చేసే మెసేజ్‌లకు రేటింగ్ ఇచ్చేలా కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.
మెసేజ్ రేటింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకొని.. యూజర్లు ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే త్వరలో అందుబాటులోకి రానుంది.
కొందరు ఐవోఎస్ యూజర్లకు కూడా ఈ ఫీచర్‌ను తీసుకురానున్నారు.
మెసేజ్ రేటింగ్ ఫీచర్‌ను ఉపయోగించి స్టార్స్ రూపంలో రేటింగ్ ఇవ్వొచ్చు.
ఇప్పటి వరకు వాట్సప్ బిజినెస్ అకౌంట్‌లో డైరెక్ట్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చే ఆప్షన్ లేదు.
వాట్సప్ బీటా యూజర్లు ఆండ్రాయిడ్ 2.21.22.7 వర్షన్‌ను ఉపయోగిస్తున్నవాళ్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.
బిజినెస్ అకౌంట్ నుంచి వచ్చిన మెసేజ్‌లకు మాత్రమే రేటింగ్ ఇచ్చే చాన్స్ ఉంటుంది.
రేటింగ్ ఇచ్చే వాట్సప్ యూజర్ వివరాలను వాట్సప్ వెల్లడించదు.
దీంతో ఆ రేటింగ్ ఎవరు ఇచ్చారు అనే విషయాన్ని తెలుసుకోలేరు.
ఈ ఫీచర్ ద్వారా రేటింగ్ ఇవ్వాలని అనుకునేవాళ్లు.. వాట్సప్ బిజినెస్ చాట్ ఓపెన్ చేసి మెసేజ్‌ను సెలెక్ట్ చేసుకుంటే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
దాంట్లో కాపీ, రిపోర్ట్, రేట్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి.
అందులో రేట్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకొని రేటింగ్ ఇవ్వొచ్చు.