Homeఅంతర్జాతీయం#Bike : భారత్​లో దూసుకొస్తున్న విదేశీ బైక్​లు

#Bike : భారత్​లో దూసుకొస్తున్న విదేశీ బైక్​లు

The Indian company TVS .. acquired Norton earlier this year with plans to expand the range of British bike brand Norton products.

బ్రిటిష్ బైక్ బ్రాండ్ నార్టన్ ఉత్పత్తులను విస్తృతంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలతో ఈ ఏడాది మొదట్లో భారతీయ సంస్థ టీవీఎస్.. నార్టన్‌ని కొనుగోలు చేసింది.

భారతీయ యాజమాన్య నిర్వహణలో విజయాన్ని చవి చూస్తున్న చరిత్రాత్మక రాయల్ ఎన్‌ఫీల్డ్ అడుగు జాడల్లో నడిచేందుకు నార్టన్ సన్నద్ధం అవుతోంది.

వ్యాపారాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడుతున్న పేరున్న బ్రాండ్లను లాభాల దిశగా పయనింప చేసేందుకు భారతీయ ఉత్పత్తిదారులు ఆసక్తి చూపడం పట్ల వ్యాపార నిపుణులు పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయటం లేదు.

బీఎస్ఏ బ్రాండు పేరుతో బ్రిటన్‌లో ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను తయారు చేసి బ్రిటిష్ మోటార్ బైక్ పరిశ్రమను పునరుద్ధరణ చేయాలని ఆశిస్తున్నట్లు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర చెప్పారు.

ఈ మోటార్ బైక్‌లను బర్మింగ్‌హామ్‌లో 2021 మధ్యకల్లా తయారు చేయడం మొదలు పెట్టాలని మహీంద్రా గ్రూపు భావిస్తోంది.

కొత్తగా జీవం పోసుకున్న బీఎస్ఏ ఆక్స్‌ఫర్డ్ షైర్, బాన్బరిలో త్వరలోనే ఎలక్ట్రిక్ మోటార్ బైక్ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఒక పరిశోధనా కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ఈ లోపు పెట్రోల్ ఇంజన్లతో నడిచే వాహనాలను తయారు చేస్తారు.

మోటార్ సైకిళ్ళ ఉత్పత్తిలో బ్రిటన్‌కున్న చరిత్రను బట్టి యూకేని పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నుకున్నట్లు ఆనంద్ మహీంద్ర చెప్పారు.

ఆయన ఆస్తుల విలువ 1.7 వేల కోట్ల రూపాయలు అని ఫోర్బ్స్ మ్యాగజైన్ అంచనా వేసింది.

బర్మింగ్ హాం స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) ని 1861లో స్థాపించారు.

1950 నాటికి ట్రైయంఫ్ , సన్ బీమ్ బ్రాండ్లకు కూడా యాజమాన్య బాధ్యతలు వహిస్తూ ప్రపంచంలోనే అత్యధికంగా మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేసే సంస్థగా బీఎస్ఏ నిలిచింది.

కానీ, ఈ సంస్థ ఆర్ధికంగా దివాళా తీయడంతో 1970ల నాటికి ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది.

ఆ తర్వాత 2016లో దానిని మహీంద్రా గ్రూపు కొనుగోలు చేసింది.

బీఎస్ఏ అధికారికంగా క్లాసిక్ లెజెండ్స్ సంస్థ యాజమాన్యంలో ఉంది. ఈ సంస్థలో మహీంద్రా గ్రూపుకు 60 శాతం వాటా ఉంది.

ఈ సంయుక్త భాగస్వామ్యానికి యూకే ప్రభుత్వ మద్దతు కూడా లభించింది.

దీంతో బీఎస్ఏ ఎలక్ట్రిక్ బైకుల ప్రాజెక్టుకు యూకే ప్రభుత్వం 4.6 మిలియన్ పౌండ్ల గ్రాంటును జారీ చేసింది.

ఈ ఉత్పత్తి మొదలైతే 255 మందికి ఉద్యోగావకాశాలు లభించవచ్చని ఆశిస్తున్నారు.

“ఈ క్లాసిక్ బ్రిటిష్ వాహనం యువ వినియోగదారులను మాత్రమే కాకుండా తిరిగి యవ్వనంలోకి అడుగు పెట్టాలనుకునే బైక్ ప్రియులను కూడా ఆకర్షిస్తుంది” అని మోటార్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ స్కాట్ లుకైటీస్ అన్నారు.

“పాత బైక్‌కి ఉన్న శైలి, తరహాను ఎలక్ట్రిక్ బైక్‌లో కూడా అందివ్వగల్గితే, వారు ఈ వ్యాపారంలో గెలిచినట్లే” అని ఆయన అన్నారు.

“ఈ చిన్న వ్యాపార ప్రయత్నం యూకేలో బైక్ ఉత్పత్తి వ్యాపారాన్నే పునరుజ్జీవం చేయడానికి ఒక సంకేతం” అని మహీంద్ర బీబీసీతో అన్నారు.

భారతీయ సంస్థ టీవీఎస్ మోటార్ ఏప్రిల్లో నార్టన్ సంస్థను 16 మిలియన్ పౌండ్ల ఒప్పందానికి కొనుగోలు చేసింది

నార్టన్ 1898లో స్థాపించారు. ఇది బ్రిటిష్ మోటార్ సైకిల్ బ్రాండ్లలోనే అత్యంత పురాతనమైనది. ఇది మోటార్ స్పోర్టులో బాగా పేరున్న బ్రాండు, ఇందులో డామినేటర్, కమాండో బాగా పేరున్న మోడళ్ళు.

నార్టన్ ఇంటర్ పోల్ మోడల్‌ను యూకే పోలీసులు 1980లలో వాడేవారు.

ఈ సంస్థ ఉత్పత్తి చేసే వింటేజ్ మోడళ్లను మోటార్ బైకులను సేకరించే వారి దగ్గర ఉండాల్సిన కలెక్టర్ ఐటమ్స్ అని అంటారు.

గత నెల నార్టన్ కమాండో క్లాసిక్ బైకుల ఉత్పత్తిని మొదలుపెట్టింది. ఇది పూర్తి స్థాయి ఉత్పత్తిని 2021 మొదట్లో ప్రారంభిస్తుంది.

“దీని తర్వాత ఇప్పటికే బహిర్గతం చేసిన మరి కొన్ని మోడళ్లను ఉత్పత్తి చేయడం మొదలు పెడతాం.

మరి కొన్ని కొత్త మోడళ్లను కూడా తయారు చేస్తాం” అని సంస్థ ఇంటీరియం చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ రస్సెల్ అన్నారు

ఇప్పుడు రూపొందించిన వినూత్నమైన సౌకర్యాలతో ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని ఆయన అన్నారు.

ఈ బ్రిటిష్ బ్రాండు వాహనాలు భారతీయ రోడ్ల పై తరచుగా కనిపిస్తుంటాయి. ఇవి కొన్ని పాత సినిమాల్లో కూడా కనిపిస్తాయి.

పోలీసులు కూడా వీటిని వాడేవారు అని ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ సంస్థలో ఆటోమోటివ్ నిపుణుడు వివేక్ వైద్య చెప్పారు.

ఈ భావాత్మక కారణాలను పక్కన పెడితే, భారతీయ సంస్థలు మాత్రం చాలా ధృడమైన వ్యాపార సంకల్పాలతో ఈ సంస్థల్లో పెట్టుబడి పెట్టడానికి చైతన్యవంతం అయ్యారని ఆయన అంటారు.

“ఈ బ్రాండులు మార్కెట్లో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతున్నాయి. దీనిని భారతీయ కంపెనీలు ఒక అవకాశంగా తీసుకున్నారు.

ఆ బ్రాండ్, లోగోను కొనుగోలు చేయడం ద్వారా భారతీయ వ్యాపారవేత్తలు పశ్చిమ దేశాల మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు సహకరిస్తుంది” అని ఆయన అన్నారు.

టాటా సంస్థ 2008లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను స్వాధీనం చేసుకుని లాభాలనార్జించే దిశగా తీసుకువెళ్లడాన్ని ఆయన ఉదహరించారు.

“ఇది భారతీయ ఉత్పత్తిదారులకు కచ్చితంగా పని చేస్తుందని నిరూపితమైన వ్యూహం. వారు ఒక బ్రాండును కొనుగోలు చేసి కొత్త దేశా

లకు విస్తరిస్తారు.

అలాగే, దాని పరిమాణం, లాభాలను కూడా పెంచుతారు. ఈ బ్రాండులకు ఇది దక్కాల్సిన అర్హతే” అని ఆయన అంటారు.

బ్రిటిష్ వాహనం రాయల్ ఎన్ ఫీల్డ్ వ్యాపారం కూడా విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మోటార్ బైక్ మార్కెట్ ఆసియాలోకి అడుగు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

నేటికీ ఉత్పత్తి జరుగుతున్న ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బ్రాండ్లలో ఇదొకటి.

1994 నుంచి ఇది భారతీయ సంస్థ ఐషర్ ఆధీనంలోకి వచ్చింది. ఇది థాయ్‌లాండ్‌లో కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించే ప్రణాళికలు ఉన్నట్లు ప్రకటించింది.

ఈ ప్లాంటు ఉత్పత్తిని 2021లో మొదలుపెట్టవచ్చు. ఇది భారతదేశానికి అవతల నెలకొల్పిన అతి పెద్ద ఫ్యాక్టరీ అవుతుంది.

మోటార్ బైకులను ఉత్పత్తి చేసే రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు గత సంవత్సరం 88 శాతం వృద్ధి అయ్యాయి.

1950, 60ల నుంచి ఈ చారిత్రాత్మక బ్రాండులు వ్యాపారం కొనసాగించేందుకు కష్టాలు పడుతున్నప్పటికీ , అవి పూర్తిగా అంతమైపోలేదు.

ఇప్పుడు అవి పూర్తిగా బ్రిటిష్ యాజమాన్యం చేతుల్లో లేనట్లే లెక్క.

Recent

- Advertisment -spot_img