వరంగల్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దేవరుప్పుల మండలంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌కు ఓ కస్టమర్ పెట్రోల్ కొట్టించేందుకు వచ్చాడు. అయితే అతనికి అనుమానం వచ్చి చెక్ చేయగా.. పెట్రోల్ రాకముందే మీటర్ రీడింగ్ చూపిస్తుంది. కొద్దీసేపటి తర్వాత పెట్రోల్ వచ్చింది. దీంతో బంక్ యాజమాన్యం ప్రజలను మోసం చేస్తున్నారని, సంబంధిత అధికారులు కఠిన చర్యలను తీసుకోవాలని స్థానికులు కోరారు.