Homeజాతీయంకరోనా వేళ పరీక్షలు.. కొత్త‌ మార్గదర్శకాలు విడుద‌ల‌

కరోనా వేళ పరీక్షలు.. కొత్త‌ మార్గదర్శకాలు విడుద‌ల‌

న్యూఢిల్లీః క‌రోనా కాలంలో నిర్వ‌హించే ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి స్టాండర్డ్‌ ఆపరేటింట్‌ ప్రొసీజర్‌(ఎస్‌ఓపీ)లను కేంద్ర ప్రభుత్వం స‌వ‌రించి కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. కరోనా లక్షణాలతో ఎవరైనా విద్యార్థి పరీక్ష రాయడానికి వస్తే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి పంపాలని తాజా మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. వారికి మరో తేదీన లేదా వేరే మార్గంలో పరీక్ష రాసే ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ మేరకు సవరించిన ఎస్‌ఓపీను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది. లక్షణాలున్న వారు పరీక్ష రాయలనుకుంటే వారికి కూడా అవకాశం కల్పించాలని గతంలో ఇచ్చిన మార్గదర్శకాల్లో తెలిపింది. ఈ గైడ్ లైన్స్ దేశ వ్యాప్తంగా ఉన్న యూనివ‌ర్సిటీలు, కాలేజీలు, స్కూళ్ల‌కు వ‌ర్తిస్తాయ‌ని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు, సిబ్బందికి తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్ల వంటివి అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img