New ration cards: తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. గ్రామసభల ద్వారా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. జనవరి 28 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నేడు జరగనున్న కలెక్టర్లతో సమావేశంతో మరింత స్పష్టత రానుంది.