ఏపీలో సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, ఇతర సర్వీసులకు కూడా అవకాశం కల్పించనుంది. డిసెంబర్ నెలాఖరులోపు దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసి అర్హులకు రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేయనుంది.