కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్ రానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కోహెడలో మాట్లాడుతూ.. నేటి కేబినెట్ సబ్ కమిటీలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సంక్రాంతికి రైతు భరోసా, త్వరలోనే కొత్త రేషన్ కార్డులు వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిందని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా ఉంటుందనిపేర్కొన్నారు.