Homeహైదరాబాద్latest Newsకొత్త రేషన్ కార్డులు.. కొత్త మార్గదర్శకాలివే!

కొత్త రేషన్ కార్డులు.. కొత్త మార్గదర్శకాలివే!

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే కసరత్తు చేస్తున్నారు.. మునుపటి మార్గదర్శకాలకు మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆదాయ పరిమితిలో మార్పులు చేర్పులు ఉండొచ్చు. రేషన్ కార్డు విషయంలో ఆదాయ పరిమితిని పెంచాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. కేబినెట్ సమావేశానికి ముందే మార్గదర్శకాలను ఖరారు చేసి సమర్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రేషన్ కార్డులకు సంబంధించి పాత మార్గదర్శకాల్లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాలు, నగరాల్లో రూ.2 లక్షల ఆదాయ పరిమితి ఉండేది. ఈ మొత్తాన్ని పెంచాలని అధికారులు భావిస్తున్నారు. భూమి విషయానికొస్తే 3.5 ఎకరాలు, మెట్ట భూమి 7.5 ఎకరాల వరకు గతంలో అర్హులగా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో 89.99 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2.82 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నారు.

Recent

- Advertisment -spot_img