Homeజిల్లా వార్తలునూతన రేషన్ కార్డులు మంజూరు చేయాలి

నూతన రేషన్ కార్డులు మంజూరు చేయాలి

ఇదే నిజం దేవరకొండ: డిండి మండలంలోని గోనబోయినపల్లి సిపిఐ గ్రామశాఖ నిర్మాణ శాఖ సమావేశానికి సభ అధ్యక్షత రాసాల మల్లయ్య వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ పార్టీ డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు మంజూరు చేయక రాష్ట్రంలోని ప్రజలంతా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పెండ్లిలై పిల్లలు పుట్టిన రేషన్ కార్డులు లేక చాలా కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో ఏ పథకాలకు నోచుకోకుండా జనాలు నాన రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రజలకు నూతన రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వ పథకాలు వాళ్లకు అమలయ్యే విధంగా నిరంతరం రేషన్ కార్డ్ ఆన్లైన్ సైట్ ను ఓపెన్ చేసి ఉంచాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. స్థానిక ఎన్నికలల్లో మీరంతా పోటీ చేసే విధంగా సిద్ధంగా ఉండాలని పార్టీ ఏ పిలుపిచ్చిన ఆ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ డిండి మండల కార్యవర్గ సభ్యులు హనుమండ్ల కేశవులు, నడింపల్లి మల్లయ్య, గుండు పూరషోత్తం, గుండు పెద్దయ్య,నాగరాజు, పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img