– అర్హులైన పేదలందరికీ అందజేత
– 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు
– 4 లక్షల 56 వేల ఇందిరమ్మ ఇండ్లు
– కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ
– 16 బీసీ , ఎస్సీ , ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటు
– ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అమీర్ అలీఖాన్
– 84 శాతం మందికి రైతు బంధు ఇచ్చాం: మంత్రులు
– రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: త్వరలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు (Ration Cards) ఇవ్వాలని ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇచ్చినట్లు తెలంగాణలోనూ డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. హౌసింగ్ కార్పొరేషన్ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నారు. 16 బీసీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై త్వరలోనే జీవో ఇస్తామని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తెలిపారు. పైరవీలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం అన్నారు. మొదటి విడతగా 4 లక్షల 56 వేల ఇళ్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించారు.
ప్రతీ నియోజక వర్గానికి 3500 ఇండ్లు ఇవ్వనున్నారు. గ్రామ సభల్లో లబ్ది దారులను ఎంపిక చేయనున్నారు. రైతు బంధు 84 శాతం మందికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంతో చేసిన విద్యుత్ కొనుగోళ్ల అంశంపై విచారణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సైతం కేబినెట్ చర్చించింది. కాళేశ్వరం నిర్మాణంలో లోపాలు, నాణ్యతపై రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ చంద్రఘోష్ నేతృత్వంలో విచారణకు కేబినెట్ నిర్ణయించింది. విచారణ చేపట్టి చంద్రఘోష్ కమిటీ 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని గడువు ఇచ్చారు.
మరో రెండు రోజుల్లో 93 శాతం రైతులకు రైతు బంధు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 16 బీసీ , ఎస్సీ , ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటు చేయనున్నారు. ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ కురుమ కార్పొరేషన్, మున్నూరుకాపు కార్పొరేషన్, పద్మశాలి కార్పొరేషన్, పెరిక (పురగిరి క్షత్రియ) కార్పొరేషన్, లింగాయత్ కార్పొరేషన్, మేరా కార్పొరేషన్, గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయనున్నారు. ఆర్య వైశ్య కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, మాదిగ, మాదిగ ఉప కులాల కార్పొరేషన్, మాల, మాల ఉప కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. కొమురం భీమ్ ఆదివాసి కార్పోరేషన్, సంత్ సేవాలాల్ లంబాడి కార్పోరేషన్, ఏకలవ్య కార్పోరేషన్, మహిళా సాధికారితలో భాగంగా మహిళల కోసం ఔటర్ రింగురోడ్డు చుట్టు మహిళా రైతు బజార్లు ఏర్పాటు చేయనున్నారు.