హైదరాబాద్: తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చింది. ఇటీవల అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఉభయసభల ఆమోదం పొందిన బిల్లులకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదముద్ర వేయడంతో చట్టాలుగా మారాయి. ఈనెల 19న గెజిట్ నోటిఫికేషన్లు ప్రచురించారు. అందుకు అనుగుణంగా న్యాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
భూ హక్కులు – పాసు పుస్తకాలు, వీఆర్‌వోల రద్దు, టీఎస్ బీపాస్, పురపాలక, పంచాయతీరాజ్, ప్రైవేటు వర్సిటీలు, తెలంగాణ విపత్తు, ప్రజారోగ్య పరిస్థితి బిల్లు, తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లు, తెలంగాణ ఫిస్కల్ రెస్సాన్స్‌బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ బిల్లు, తెలంగాణ న్యాయస్థానాల రుసుము, దావాల మదింపు సవరణ బిల్లు, తెలంగాణ సివిల్ న్యాయస్థానాల సవరణ బిల్లుతో పాటు జీఎస్టీ సవరణ చట్టాల అమలుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది.
అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం
RELATED ARTICLES