Homeహైదరాబాద్latest Newsటీ20 ప్రపంచకప్‌లో కొత్త రూల్.. అయ్యో.. బౌలర్లకు ఎంత కష్టం వచ్చిందే..!

టీ20 ప్రపంచకప్‌లో కొత్త రూల్.. అయ్యో.. బౌలర్లకు ఎంత కష్టం వచ్చిందే..!

క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి మరో మెగా టోర్నీ సిద్ధమైంది. రేపటి నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మహా సమరానికి అమెరికా-వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఇరవై జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయిదు జట్ల చొప్పున నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి తలపడనున్నాయి.టైటిల్ గెలవడమే లక్ష్యంగా యూఎస్ఏలో అడుగుపెట్టిన భారత్.. టోర్నీలో హాట్ ఫేవరెట్ ఉంది. గత వన్డే ప్రపంచకప్‌లో తృటిలో చేయి చేజార్చుకున్న రోహిత్ సేన.. ఈసారి షార్ట్‌కప్‌ను కైవసం చేసుకునేందుకు తీవ్రంగా సిద్ధమవుతోంది. అయితే రానున్న టీ20 వరల్డ్‌కప్ నుంచి స్టాప్ క్లాక్ రూల్‌ పూర్తి స్తాయిలో అమల్లోకి రానుంది. ఇకపై ఫీల్డింగ్ టీమ్‌కు ఓవర్ల మధ్య 60 సెకన్ల కౌంట్‌డౌన్ ఉంటుంది. ఆలోపు మరో బౌలర్ ఓవర్ ప్రారంభించాలి. లేదంటే అంపైర్ 2సార్లు వార్నింగ్ ఇచ్చి, ఆ తర్వాత 5 రన్స్ ఫెనాల్టీ విధిస్తారు. ఈ రూల్ వల్ల మ్యాచ్ సమయం వృథా కాకుండా ఉంటుందని ఈ రూల్ తీసుకొచ్చారు.

Recent

- Advertisment -spot_img