పెరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకొని.. ట్రాయ్ కొత్త నిబంధన తీసుకురానుంది. వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే టెలికం ప్రొవైడర్ ఆ నంబర్‌ను రెండేళ్లు బ్లాక్ చేయాలని ఆదేశించింది. స్పామ్ కాల్స్ పేరుతో మోసాలు పెరుగుతుండటంతో ఈనిర్ణయం తీసుకుంది. అటు స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌కు భారీగా కనెక్షన్లు వాడే సంస్థలను బ్లాక్‌లిస్టులో చేర్చాలని TRAI స్పష్టం చేసింది.