Homeతెలంగాణకొత్త తరహా సైబర్ మోసం.. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో 80లక్షలు దోచేశారు..

కొత్త తరహా సైబర్ మోసం.. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో 80లక్షలు దోచేశారు..

ఈ రోజుల్లో సైబర్‌ నేరాలు ఏ స్థాయి జరుగుతున్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలు చేస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. అదేవిధంగా నిన్న సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో కేటుగాళ్లు ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.80 లక్షలు దోచుకున్నారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఓ ప్రైవేట్ ఉద్యోగికి ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ లింక్ పంపారు. అందులో 66.75 లక్షలు పెట్టుబడి పెట్టించారు. చాలా రోజులు గడిచినా లాభాలు ఇవ్వకపోగా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Recent

- Advertisment -spot_img