న్యూ ఇయర్ సందర్భంగా నేరాలు, ప్రమాదాల పట్ల TGSRTC ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలకు విలువైన సూచనలు చేశారు. ‘మీ న్యూ ఇయర్ ను రోడ్డు ప్రమాదరహితంగా ప్రారంభించండి! మద్యం మత్తులో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణం కావొద్దు. ఎంజాయ్ పేరుతో చేసే బైక్ రేసింగ్లు అత్యత ప్రమాదకరమని గుర్తుంచుకోండి. మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం.. తల్లిదండ్రుల్లారా! కొత్త ఏడాది కదా అని పిల్లలకు వాహనాలు ఇవ్వకండి’ అని ట్వీట్ చేశారు.