న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 31న వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ల పర్మిషన్లను ఒంటి గంట వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.