తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ దసరా కానుక ఇవ్వనున్నట్లు సమాచారం. పెండిగ్ ఉన్న నాలుగు డీఏలలో రెండింటిని క్లియర్ చేయాలని ప్రభుత్వం యోచిస్తుందట. నవంబర్ 1న అందు కోబోయే అక్టోబర్ జీతంతోనే ఈ రెండు డీఏల అమౌంట్ను కూడా కలిపి ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం 2022 జూలై నుంచి డీఏలు పెండింగ్లో పెట్టిన విషయం తెలిసిందే.