NIA:పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నది. కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహిస్తున్నది. ఎన్ఐఏ, ఈడీ అధికారులు సంయుక్తంగా ఏకకాలంలో 40కిపైగా ప్రాంతాల్లో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో వివిధ నేరాలతో సంబంధాలున్న 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.