Homeక్రైంమరో పేలుళ్ల కుట్రను ఛేదించిన ఎన్​ఐఏ

మరో పేలుళ్ల కుట్రను ఛేదించిన ఎన్​ఐఏ

అంతర్రాష్ట్ర ఉగ్రముఠా అరెస్టు
ముర్షీదాబాద్‌: అల్‌ఖైదాకు చెందిన అంతర్రాష్ట్ర ఉగ్రముఠాను నేషనల్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. ముఠాలోని 9 మందిని పశ్చిమబంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో ఆరుగురు(షకీబ్‌, అబు సోఫియాన్‌, మెయినల్‌ మోండల్‌, యీన్‌ అహ్మద్‌, మనుమ్‌ కమల్‌, రెహ్మాన్‌), కేరళలోని ఎర్నాకుళంలో ముగ్గురి(ముర్షీద్‌ హసన్‌, యాకుబ్‌ బిస్వాస్‌, ముషారప్‌ హుస్సేన్‌)ని పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా జనసమ్మర్థ ప్రదేశాల్లో బాంబు దాడులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలు తీసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఎన్‌ఐఏ ఆరోపించింది. పట్టుకున్న ఉగ్రవాదుల నుంచి జీహాదీ సాహిత్యాన్ని, దేశీయంగా తయారైన తుపాకులు, ఇంట్లోనే పేలుడు పదార్థాలు తయారు చేయడానికి అవసరమైన పరిజ్ఞానంతో కూడిన మెటీరియల్‌, పదునైన ఆయుధాలను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేసే అల్‌ఖైదా అనుబంధగా వీరు పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. వీరిని త్వరలోనే సంబంధిత కోర్టుల్లో హాజరుపరుస్తామని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img