HomeతెలంగాణNIA raids: హైదరాబాద్​లో ఎన్​ఐఏ రెయిడ్స్​

NIA raids: హైదరాబాద్​లో ఎన్​ఐఏ రెయిడ్స్​

– పాతబస్తీ కేంద్రంగా ముమ్మర తనిఖీలు
– తమిళనాడు రాష్ట్రంలోనూ..
– కోయంబత్తూరు బాంబు బ్లాస్ట్​ కేసులో దూకుడు

ఇదేనిజం, హైదరాబాద్​: తమిళనాడు రాష్ట్రంలోని పలుచోట్ల, హైదరాబాద్​లో ఎన్​ఐఏ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. పాతబస్తీ కేంద్రంగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. ఐఎస్ సానుభూతి పరులుగా అనుమానిస్తున్న వారి ఇండ్లల్లో సోదాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్​ లోనే కాక దేశంలోని పలు చోట్ల సైతం రెయిడ్స్​ కొనసాగుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎన్​ఐఏ ఏకకాలంలో సోదాలు జరుపుతోంది. ఐఎస్‌ఐఎస్ఐ మాడ్యుల్‌లో అనుమానితులు పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. హైదరాబాద్​ లోని మలక్​ పేట, టౌలీచౌకీలో నాలుగు చోట్లు సోదాలు సాగుతున్నాయి. ఇక తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూరులో ఏకకాలంలో 30 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. కోయంబత్తూరు కారు బాంబు కేసులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img