HomeసినిమాNidhhi Agerwal : కాబోయే భర్తపై క్లారిటీ ఇచ్చిన‌ నిధి అగర్వాల్

Nidhhi Agerwal : కాబోయే భర్తపై క్లారిటీ ఇచ్చిన‌ నిధి అగర్వాల్

Nidhhi Agerwal : కాబోయే భర్తపై క్లారిటీ ఇచ్చిన‌ నిధి అగర్వాల్

Nidhhi Agerwal : ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని కెరీర్ పరంగా స్థిరపడిన నిధి అగర్వాల్ మరికొద్ది రోజుల్లో హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తనకు కాబోయే భర్త విషయమై ఆమె రియాక్ట్ అయింది.

ఇస్మార్ట్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది అందాల నిధి.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని కెరీర్ పరంగా స్థిరపడింది ఈ ముద్దుగుమ్మ.

ఈ మూవీ తర్వాత వరుస ఆఫర్స్ పట్టేస్తున్న నిధి పెళ్లి గురించి గత వారం రోజులుగా కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి.

తమిళ స్టార్ హీరో శింబుతో నిధి ప్రేమాయణం నడిపిస్తోందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో తనకు కాబోయే భర్త లక్షణాలు ఎలా ఉండాలనే దానిపై ఓపెన్ అయింది నిధి అగర్వాల్.

మహేష్ బాబు బావ, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ గ‌ల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గ‌ల్లా హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా ‘హీరో’.

సంక్రాంతి కానుకగా ఈనెల 15న ఈ మూవీని విడుదల చేస్తున్న సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నిధి అగర్వాల్ తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సినీ విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది.

తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసింది.

అబ్బాయిల విషయంలో అమ్మాయిల్లో ఒక్కొక్కరికి ఒక్కో కల ఉంటుందని, తనకు మాత్రం గౌరవం ఇచ్చిపుచ్చుకునే వ్యక్తులంటే చాలా ఇష్టమని నిధి చెప్పింది.

తనొక్కదాన్నే కాకుండా.. చుట్టు ప్రక్కల అందరితోనూ గౌరవభావంతో ఉండే వ్యక్తిత్వాన్ని తాను ఇష్టపడతానని, ఒక్క మాటలో చెప్పాలంటే తన తండ్రిలా ఉండాలని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.

అలాంటి వ్యక్తి తారసపడితేనే పెళ్లి అని చెప్పింది ఇస్మార్ట్ బ్యూటీ.

‘హీరో’ సినిమాతో పాటు ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నానని చెప్పిన నిధి అగర్వాల్.. ఆ తర్వాత తెలుగులో మరే సినిమాకు కమిట్ కాలేదని చెప్పింది.

ఏప్రిల్ నుంచి ఓ హిందీ సినిమాలో భాగం కాబోతున్నానని, అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో చేసిన ఓ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని ఆమె చెప్పింది.

Priyanka Chopra వీడియోకు ఫిదా అయిన‌ Samantha ఇంతకీ ఆ వీడియోలో ఏముంది

Samantha Ruth Prabhu : ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదు..

Recent

- Advertisment -spot_img