Nidhi Agarwal : టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా తెరకెక్కనుంది. గతంలో వీరిద్దరి కలయికలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలకు త్రివిక్రమ్ కేవలం రచయితగా మాత్రమే పనిచేశారు. ఈసారి ఆయన స్వయంగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరిస్తుండటంతో సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే నిధి అగర్వాల్ నటించిన ‘హరిహర వీరమల్లు’, ‘ది రాజాసాబ్’ వంటి పాన్-ఇండియా చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ క్రమంలో నిధి అగర్వాల్ మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టిసింది అనే చెప్పాలి. ఈ సినిమాని హారికా & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు నాగ వంశీ మరియు చిన్న బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది.