Homeహైదరాబాద్latest NewsNidhi agarwal: హీరోయిన్ నిధి అగర్వాల్ కు బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు..!!

Nidhi agarwal: హీరోయిన్ నిధి అగర్వాల్ కు బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు..!!

Nidhi agarwal: హైదరాబాద్‌కు చెందిన నిధి అగర్వాల్ మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చింది. బాలీవుడ్ మూవీ ‘మున్నా మైఖేల్’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ”హరి హర వీరమల్లు” అనే సినిమాలో నటిస్తుంది. తాజాగా నిధి అగర్వాల్‌ సోషల్ మీడియాలో కొందరు తనను బెదిరిస్తున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ విషయమై హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi agarwal) ఫిర్యాదు చేస్తూ, సోషల్ మీడియాలో తనను ఎవరో నిత్యం బెదిరిస్తున్నారని పేర్కొంది. తనపై, తన కుటుంబంపై బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నాడు. దీని వల్ల నేను చాలా ఒత్తిడికి గురవుతున్నాను అని తెలిపింది. కావున సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక వేధింపుల కేటగిరీల కింద హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi agarwal) పోలీసులకు ఫిర్యాదు చేసారు.

Recent

- Advertisment -spot_img