Homeహైదరాబాద్latest Newsఒకేరోజు ఆ స్టార్ హీరోలతో మూవీ షూటింగ్.. ఆనందంగా ఉందంటున్న నిధి అగర్వాల్

ఒకేరోజు ఆ స్టార్ హీరోలతో మూవీ షూటింగ్.. ఆనందంగా ఉందంటున్న నిధి అగర్వాల్

నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ సినిమాలో కూడా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈ రెండింటిలో నటించడం గురించి నిధి అగర్వాల్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరిహరవీరమల్లు’, ‘రాజా సాబ్’ అనే రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఒకేరోజు ఈ రెండు ల షూటింగ్స్ లో పాల్గొనడం మరింత ఆనందంగా ఉంది. అది కూడా ఒక షూటింగ్‌ ఆంధ్రాలో, మరొకటి తెలంగాణలో జరుగుతుంది.ఈ రెండూ సినిమాలు తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని నిధి అగర్వాల్ పేర్కొంది.

Recent

- Advertisment -spot_img