టాలివుడ్ సినీ కుటుంబాల్లో వరుస పెళ్లిళ్లతో సందడి నెలకొంది. కరోనా ఉన్నప్పటికీ ఇక ఆగేది లేదంటూ సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కేస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ డాటర్ నాగబాబు కుమార్తె నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం హైదరాబాదులో జరిగింది. చైతన్య ఆంద్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన పోలీసు ఉన్నతాధికారి ప్రభాకర్ రావు కొడుకు. ప్రస్తుతం ఓ ఐటీ కంపెనీలో చైతన్య ఉద్యోగం చేస్తున్నాడు.
ఇక ఎప్పటినుంచో కరోనా మూలంగా వాయిదాపడ్డ వీరి నిశ్చితార్ధం గురువారం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో నాగబాబు కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, సాయితేజ్ పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబందించిన చిత్రాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.