Homeహైదరాబాద్latest Newsచంద్రబాబుతోనే అభివృద్ది సాధ్యం : Nikhil

చంద్రబాబుతోనే అభివృద్ది సాధ్యం : Nikhil

– హీరో నిఖిల్ సిద్ధార్థ్​

ఇదే నిజం, ఏపీ బ్యూరో: చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్​ అభివృద్ధి సాధ్యమని సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్​ అన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం నామినేషన్‌ వేశారు. చీరాల మండలం హస్తినాపురంలోని వినాయకస్వామి దేవాలయం నుంచి చీరాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో హీరో నిఖిల్‌ సిద్దార్థ, టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. గడియార స్తంభం కూడలిలో నిఖిల్‌ మాట్లాడుతూ.. చిరు నవ్వుల చీరాల కావాలంటే కొండయ్యకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.

Recent

- Advertisment -spot_img