niranjan reddy:నాణ్యమైన ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు . వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, పోషకాలు, క్రిమిసంహారక మందుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు . నాణ్యమైన దిగుబడి, రైతుల ఆదాయం పెంచేందుకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల పాత్రపై ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో నిర్వహించిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు .
నాణ్యమైన ఉత్పత్తుల వాడకంతోనే నాణ్యమైన దిగుబడులు .. నాసిరకం మందులు, ఎరువుల వాడకాన్ని కలిసికట్టుగా నిరోధించాలని కోరారు . రైతులు వ్యాపారులను నమ్మి ఉత్పత్తులు కొంటారు .. అలాంటి రైతులను ఎవరూ మోసం చేయవద్దని అన్నారు.. ఈ విషయంలో ఉత్పత్తిదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు ఎరువులు, పురుగుమందులలో నాణ్యమైనవి గుర్తించేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లాలలో రైతులకు ఈ విషయంలో చైతన్యం చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు