రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ముంబైలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు నీతా అంబానీ కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు, తమవల్ల ఏదైనా తప్పులు జరిగి ఉంటే క్షమించాలని కోరారు. మరోవైపు ఆమె మీడియానుద్దేశించి మాట్లాడిన విధానాన్ని చూసి గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.