Homeహైదరాబాద్latest Newsఉద్యోగులకు న్యాయం చేయాలి : ఐటీ ఉద్యోగుల సంఘం

ఉద్యోగులకు న్యాయం చేయాలి : ఐటీ ఉద్యోగుల సంఘం

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) మండిపడింది. దాదాపు 2000 మందిని క్యాంపస్ రెక్రూట్‌మెంట్ ద్వారా ఎంపిక చేసుకొని ఆన్‌బోర్డింగ్ నిలిపివేశారని ఆరోపించింది. ఇది ఉద్యోగులకు ఆర్థిక, మానసిక ఇబ్బందులకు గురిచేసే అంశంగా పేర్కొంది. దీనిపై జోక్యం చేసుకోవాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను NITES కోరింది. కాగా గతంలోనూ 200 మందికి టీసీఎస్ రిక్రూట్‌మెంట్ ఆలస్యం చేసిందని మహారాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img