Nithin : 2002లో ”జయం” సినిమాతో నితిన్ (Nithin) హీరోగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తరువాత చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. 2007లో వచ్చిన ”సై” సినిమా హిట్ కాగా ఆ తరువాత వరుసగా 12 ప్లాప్ లు ఇచ్చాడు. దీంతో నితిన్ సినీ కెరీర్ ముగిసిపోయింది అని అందరూ అన్నారు. కానీ 2012లో వచ్చిన ”ఇష్క్” సినిమాతో సూపర్ హిట్టు కొట్టాడు. ఇక వరసగా మూడు హిట్లు కొట్టిన నితిన్ మళ్ళీ వరుస డిజాస్టర్ లు ఇచ్చాడు. ఈ క్రమంలో 2020లో వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ”బీష్మ” సినిమా నితిన్ కి సాలిడ్ హిట్టు ఇచ్చింది. మళ్ళీ 5 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో ”రాబిన్ హుడ్” సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా విడుదలయ్యాక పెద్ద ప్లాప్ గా నిలిచింది. ఇలా హిట్టు కాంబినేషన్ తో హిట్టు వస్తుంది అని నితిన్ అనుకుంటే అతనికి పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే రొటీన్ సినిమాలు చేస్తూ నితిన్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఇకముందు అయిన కంటెంట్ బేసెడ్ సినిమాలు తీస్తే నితిన్ కెరీర్ గాడిలో పడుతుంది.