‘జయం’మూవీతో కెరీర్ ప్రారంభించిన టాలీవుడ్ హీరో నితిన్‌కు స్టార్టింగ్‌లో ‘దిల్’,‘సై’లాంటి సూపర్హిట్లు పడ్డప్పటికీ ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లతో వెనకపడిపోయాడు. మళ్లీ 2012లో వచ్చిన ఇష్క్, ఆ తర్వాత ఏడాది రిలీజైన గుండెజారి గల్లంతయిందే సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అయితే, కెరీర్ మొత్తంలో ఫ్లాప్‌లు ఎక్కువున్నప్పటికీ రెండేళ్లకోసారి హిట్లు కొడుతూ టాలీవుడ్లో తన స్థానాన్ని నితిన్ సుస్థిరం చేసుకున్నాడు. కరోనాకు ముందు రిలీజైన భీష్మ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన నితిన్‌ను ఆ తర్వాత వరుస పరాజాయాలు పలకరించాయి. ఈసారి మళ్లీ ఎలాగైన హిట్టు కొట్టి బ్యాక్ టు ఫామ్‌లోకి రావాలని నితిన్ గట్టిగా ట్రై చేస్తున్నాడు. తాజాగా అతడు నటించిన ‘ఎక్స్ట్రా.. ఆర్డినరీ మ్యాన్’మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దర్శకుడు వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ మూవీ నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం గ్రాండ్‌గా జరిగింది. ఈ మూవీ విషయంలో చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. హరిస్ జైరాజ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ నిర్మించింది. ఈ నెల 8న ఈ మూవీ రిలీజ్ కానుంది.