Nitin Gadkari:ప్రతి ట్రక్కుకు 2025 నాటికీ ఏసీ క్యాబిన్ విధిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది ఈ మేరకు దీనికి సంబంధించిన ఫైల్ మీద సంతకం చేసినట్లు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం వెల్లడించారు. దీని అమలుకు 18 నెలల సమయం ఇస్తున్నట్లు తెలిపారు . డ్రైవర్లు 45 నుంచి 47 డిగ్రీల వేడిలో ట్రక్కులు నడుపుతుండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు .
వోల్వో , స్కానియా వంటి పెద్ద ఒపేరాతోర్స్ మాత్రమే ఏసీ క్యాబిన్స్ తో వస్తున్నాయని , చాలా ట్రక్కులు రావడం లేదన్నారు . ఈ విషయం మీద ట్రక్ ఇండస్ట్రీ కొంత వెసులుబాటు కోరింది .ఆప్షనల్ గా ఉంచాలని కోరగా కేంద్రప్రభుత్వం ససేమిరా అన్నది. ఏసీ ఏర్పాటు చేయడం వల్ల డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తూ నిద్రపోయే ప్రమాదం ఉందని వాదించగా, ఆర్టీసీ డ్రైవర్స్ కు కూడా గతంలో ఏసీ లేదని ,ఓల్వో బస్సులను నడుపుతున్నారని అధికారులు తెలిపారు